సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. దసరా బోనస్ ప్రకటన

-

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సింగరేణి  కార్మికులకు   లాభాల్లో వాటాను దసరా ముందు పంచి కార్మికుల కుటుంబాల్లో పండుగ సంతోషాన్ని చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు  సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణిది కీలక పాత్ర అన్నారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణిలో 25వేల కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఉద్యోగస్తులకు, కార్మికులకు కలిపి మొత్తం  రూ.796 కోట్లు బోనస్ రూపంలో అందిస్తున్నామని తెలిపారు.

గత ఏడాది కంటే రూ.20కోట్లు అధికంగా ఇస్తున్నట్టు తెలిపారు. ఒక్కొక్క కార్మికుడికి లక్ష రూ.90వేలు అందజేస్తున్నామని తెలిపారు. తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఉత్పత్తులను పెంచి ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. 2023-2024లో సింగరేణి సంస్థ 4,701 కోట్ల లాభాల్లోకి వెళ్లిందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version