93 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది : హరీష్ రావు

-

మల్లన్నసాగర్ ని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరానికి ఖర్చు అయ్యింది 93 వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది అని ప్రశ్నించారు. కాళేశ్వరం మునిగిపోయింది, కొట్టుకు పోయింది లక్ష కోట్లు వృధా అయ్యాయి అనే కాంగ్రెస్ నాయకులకు ఇది చెంపపెట్టు. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్నసాగర్ లో నీళ్లు ఎలా వచ్చాయి.

కాళేశ్వరం జలాలతో మల్లన్నసాగర్ 21 TMC ల నీటితో నిండి నిండు కుండలా ఉంది. గోదావరి జలాల వల్లనే రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ నిండింది. ఈ రిజర్వాయర్ల కింద పండే ప్రతి గింజలో కేసీఆర్ పేరుంటుంది. BRS ది వాటర్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే.. కాంగ్రెస్ అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడితే మీ పాపాలు పోతాయి. ఆనాడు రిజర్వాయర్ కట్టేటప్పుడు ఈనాడు నీళ్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version