కరోనా మహమ్మారి అందరినీ ఇబ్బందులు పెడుతోంది. ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడం ముఖ్యం. కరోనా ని దృష్టి లో ఉంచి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
దీనితో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యం లో ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట కలిగే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇది టేక్స్ పేయర్స్ కి మంచి వార్త అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 30 వరకు కూడా వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అందుబాటు లో ఉండనుంది గమనించండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా మందికి ఊరట కలిగే అవకాశముంది
పన్ను చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తో ప్రయోజనం పొందొచ్చు. ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే కనుక ఈ స్కీమ్ కింద సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు అని కేంద్రం అంది. ఒకేసారి కొంత పేమెంట్ చెల్లిస్తే సరి పోతుంది.