తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడుదల చేసి… రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చూట్టమన్నారు. సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందని తెలిపారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా , ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోందన్నారు. తెలంగాణ లో ఎక్కడా చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుతుందని వివరించారు. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి… చేపలను ఉత్తర భారతం తో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నా మన్నారు హరీష్ రావు.