వైరల్ : దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట..!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మాత్రం మన మధ్యే ఉన్నాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లో ఎన్నో పాటలు పాడిన బాలు జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కాగా బాలు పాటలు మన దేశం లోనే కాక ఇతర దేశాల్లోనూ మోగుతున్నాయి. తాజాగా ఓ దుబాయ్ షేక్ ఎస్పీ బాలు పాటను పాడాడు.

1986 లో సూపర్ అయ్యిన “సిరివెన్నెల” సినిమాలోని “విధాత తలపున” అనే పాటను దుబాయ్ షేక్ పాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు రాకపోయినా దుబాయ్ షేక్ ఎంతో ఆకట్టుకునేలా ఎస్పీ పాటను పడటం తో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా బాలు ను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎంతో మంది గొప్ప వాళ్ళను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి బాలు ను కూడా లోకంలో లేకుండా చేసింది.