తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్…!

-

తెలంగాణా ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కరోన లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. అయినా సరే ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని భావిస్తున్న తెలంగాణా ప్రభుత్వం వాళ్లకు ఆర్ధికంగా సహాయం చెయ్యాలని భావించింది. ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డు లబ్ధి దారులకు సంబంధించిన 74 లక్షల బ్యాంకు అకౌంట్లలో రూ. 1500 జమవుతాయని తెలంగాణా మంత్రి కేటిఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అందుకోసం ఇప్పటికే రూ.1112 కోట్లు ఆయా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసిందని, ఆయా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులందరికీ రూ.1500 జమ అవుతాయని ఆయన ట్విట్టర్ లో ఆయన వివరించారు.

అదే విధంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87శాతం కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 76 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు బియ్యం తీసుకున్నారన్నారు. ఒక్కొకరికి 12 కేజీల బియ్యం అందిందని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరిగిందన్న ఆయన… ఈ విషయంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ అద్భుతంగా పనిచేసిందని ఆయన ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news