జగన్ మళ్ళీ ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందా…?

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది అనే వార్తలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నా సరే జగన్ మాత్రం స్థానిక సంస్థల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 439 గా ఉంది. నిన్న ఒక్క రోజే 19 కేసులు నమోదు అయ్యాయి. ఇక క్రమంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి.

అయినా సరే ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని మార్చింది జగన్ సర్కార్. ఇప్పుడు ఎన్నికలను నిర్వహించడానికి గాను కొత్త ఎన్నికల సంఘం అధికారికి ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన రంగంలోకి దిగిన వెంటనే ఎన్నికల అధికారులతో సమావేశమై ఎన్నికల కోసం సిద్దం కావాలని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే నిర్వహించడానికి సిద్దంగా ఉండాలని సూచనలు చేసారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది.

మార్చ్ లో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయే అవకాశం ఉందని అనుకున్నారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆ డబ్బులు వచ్చేసాయి. అయినా సరే ఎందుకు ఇప్పుడు ఎన్నికల మీద అంత దూకుడు గా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఏపీలో నమోదు అవుతున్న కొన్ని కేసుల మీద అనేక అనుమానాలు ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో ఈ అడుగు ఎంత మాత్రం మంచిది కాదు అనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో… దూకుడుగా ఉండటానికి అర్ధం ఏంటీ అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఏదైనా తేడా వస్తే మాత్రం కరోనా ఊహకు కూడా అందే అవకాశం ఉండదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికాను చూసినట్టు… అప్పుడు ఎపీని చూసే పరిస్థితి ఉంటుందనేది కొందరి మాట.

Read more RELATED
Recommended to you

Latest news