ఏపీలోని పేద ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఇళ్ల పట్టాల కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గత ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా గృహ నిర్మాణం కోసం ఏకంగా.. రూ.13,105 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 3.46 లక్షల మెట్రిక్ టన్నుల గృహ నిర్మాణం కోసం ఏకంగా రూ.13, 105 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు వివరించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కేసులు పరిష్కారం ఆలస్యమయ్యే చోట.. ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలన్నారు.