ధాన్యం కొనుగోలు గొడ‌వ తీరిందా? ఓవ‌ర్ టు హరీశ్

-

బీజేపీతో హై బీపీ వ‌చ్చిన విధంగా తెగ త‌గువులు పెట్టుకునేందుకు ట్రై చేసిన కేసీఆర్ అండ్ కో ఆఖ‌రికి త‌గ్గిపోయింద‌ని తెలుస్తోంది. కేంద్రం కూడా అవ‌స‌రాల మేర‌కు తెలంగాణ స‌ర్కారు నుంచి రా రైస్ కొనుగోలు చేయ‌నుంది. క‌నుక ఇప్పుడు త‌గువులు లేవు. కానీ ఇంత‌వ‌ర‌కూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని రైతుల క‌ష్టాలు తీర్చాయి అన్న‌దే పెద్ద సందేహం. నూక‌లు ఎక్కువ ఉంటాయి అన్న సాకుతోనే ఇంత పెద్ద వాదోప‌వాదానికి తెర లేపిన కేంద్రం ఇక‌పై కూడా ఇదే ధోర‌ణితో ఉంటుందా ?

ఎఫ్ సీ ఐ అధికారుల‌కు కిష‌న్ రెడ్డి క్లాస్ ఇచ్చారు. ఆ విధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి బీజేపీ ఈ సారి లైన్ క్లియ‌ర్ చేసింది. అదేవిధంగా హ‌రీశ్ కూడా త‌న వంతుగా జిల్లాల‌లో ప‌ర్య‌టిస్తూ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు ఇస్తున్నారు. యాసంగి లో  ఉత్ప‌త్తి అయ్యే ధాన్యంలో ఎక్కువ నూక‌లు వ‌స్తాయి అని ఎప్ప‌టి నుంచో కొనుగోలుకు కేంద్రం కొంత ముఖం చాటేసింది. కానీ
ఈ సారి రా రైస్ తీసుకునేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింది. మ‌రి! ఈ వివాదం ఇక్క‌డితో ముగిసిందా?

యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీకీ తెలంగాణ స‌ర్కారుకు మ‌ధ్య ర‌గడ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే! ఎట్ట‌కేల‌కు తామే ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించి, రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు.ఈ నేప‌థ్యంలో ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మంత్రి హ‌రీశ్ రావు ప‌ర్య‌టించి సంబంధిత ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.  కేంద్రం ఇచ్చిన మాట త‌ప్పింద‌ని అందుకే తాము రంగంలోకి దిగామ‌ని ఎప్ప‌టిలానే ఆయ‌న ఒక స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. వ‌డ్లు కొనుగోలుకు సంబంధించి నాలుగు వేల కోట్ల‌కు పైగా స‌ర్కారుపై భారం ప‌డిన‌ప్ప‌టికీ అదంతా తాము భరించేందుకు సిద్ధంగానే ఉన్నామ‌ని స్ప‌ష్టం చేస్తూ మ‌రో సారి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ఓ విధంగా సీఎం కేసీఆర్ కూడా ధాన్యం కొనుగోలుపై పూర్తి దృష్టి సారించాల‌ని చెప్పిన మాట మ‌రువ‌కూడ‌దు కానీ క్షేత్ర స్థాయిలో ఇవ‌న్నీ అమ‌లుకు నోచుకుంటాయా అన్న సందేహాలు విప‌క్షం నుంచి వ‌స్తున్నాయి. అయితే కిష‌న్ రెడ్డి కూడా ఎఫ్ సీ ఐ అధికారుల‌కు కొన్ని స్ప‌ష్ట‌మ‌యిన ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం ఎంత ధాన్యం ఇచ్చినా తీసుకోవాల‌ని అన్నారు. దీంతో ఇప్ప‌టికిప్పుడు రైతుకు జ‌రిగే న్యాయం పైనే అటు బీజేపీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర స‌మితి కానీ ఓ స్ప‌ష్ట‌మ‌యిన వైఖ‌రిని ప్ర‌క‌టిస్తే బాగుంటుంది. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేశాక  సంబంధిత పైస‌లు త‌మ ఖాతాల్లోకి అనుకున్నంత సులువుగా జ‌మ కావ‌ని ఎప్ప‌టి నుంచో రైతులు గ‌గ్గోలుమంటూ ఉన్నారు. కేసీఆర్ చెప్పిన కార‌ణంగా కొంద‌రు రైతులు వ‌రి సాగు వ‌ద్ద‌నుకుని చాలా  న‌ష్ట‌పోయారు అన్న వార్త‌లు కూడా ద్రువీక‌ర‌ణ‌కు నోచుకున్నాయి. క‌నుక ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తాం అని చెప్పుడు కాదు పైస‌లు ఇచ్చుడే ప‌ర‌మావ‌ధి కావాలి.

ఈ నేప‌థ్యంలో హ‌రీశ్ రావు ఏమ‌న్నారో చూద్దాం…

  •  ఈసారి రా రైస్ గా పట్టిస్తున్నాం కాబట్టి.. వడ్లు తడిస్తే పనికి రావు.
  •  వడ్లు తడవకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి.
  •  కొనుగోలు కేంద్రల వద్ద  టార్పాలిన్ పట్టాలు ఎక్కువ సమకూర్చుకోవాలి.
  •  వడ్ల కొనుగోలు జరిగే రోజుల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి.
  •  ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలి.
  •  వడ్ల కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహించినా,
  • రైతులకు ఇబ్బందులు కలిగినా చర్యలు తప్పవు.
  •  అవసరమైన చోట ప్రయివేట్ గోదాములు అద్దెకు తీసుకోవాలి.
  •  రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించాలి.

Read more RELATED
Recommended to you

Latest news