తెలంగాణలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు..

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు..వచ్చేశాయి. ఇక ఈ మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో ప్రారంభించనున్నారు. ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణ అనుభూతిని కలిగించే సదుపాయాలు ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులల్లో కల్పించారు.

Electric super luxury buses available

41 సీటింగ్ సామ‌ర్థ్య‌మున్న 35 ఎల‌క్ట్రిక్ బ‌స్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో ప్రారంభించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే 325 కిలో మీట‌ర్లు ప్ర‌యాణిస్తాయి. 2-3గంట‌ల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ ఎక్కుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news