టీటీడీ తరహాలో మిగిలిన దేవాలయాల్లో కూడా దేవుడి దర్శనం కోసం ఆన్లైన్ వ్యవస్థ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని.. రూ. 5 లక్షల్లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను లిస్ట్ సిద్ధం చేస్తున్నామని ప్రకటన చేశారు డెప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. దేవదాయ శాఖకు సంబంధించి 2 లక్షల ఎకరాల భూములు ఆక్రమణల్లో ఉన్నాయని వెల్లడించారు.
ఇందులో 18 పెద్ద దేవాలయాలకి చెందిన భూములే అధికమని.. దేవాలయాల్లో అవినీతి కట్టడికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేవాలయాల భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని.. దేవాలయల్లోని ఆభరణాల వివరాలను డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు కొట్టు సత్యనారాయణ. దేవాలయాల భూములు వివాదాలు ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని.. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం దేవుడితో ఆడుకుంటున్నాయని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ. సీఎం జగనుకు దేవుడిపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.