నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రభుత్వం జూన్ లో జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు విడుదల చేసింది. అయితే ఈ నెల నెల ఆగస్టు లో గ్రూప్-1, గ్రూప్-2 కి సంబంధించిన 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అయితే ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. కానీ పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలా వుంది అని తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఈ నోటిఫికేషన్ పది రోజుల్లో వచ్చేలా కనపడుతోంది. అలానే దీనిలో 36 ఖాళీల్లో గ్రూప్-1 పోస్టులు 31, గ్రూప్-2 పోస్టులు ఐదు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే గ్రూప్-1 విభాగం లో చూసినట్లయితే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)-7, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-1, డిస్ట్రిక్ట్ రిజిస్టార్/అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్-2 ఉన్నాయి అని తెలుస్తోంది.
అదే విధంగా రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్-2, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 15 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్ -2 కు సంబంధించి 5 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసినప్పటి నుండి కూడా పోస్టులని పెంచాలని అడుగుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.