ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ విమర్శలు కురిపించారు.
గన్ కంటే ముందు జగన్ వస్తాడని పబ్లిసిటీ స్టంట్ చేశారని నారా లోకేష్ అన్నారు. రియాలిటీలో గన్ను, జగను రావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు కురింపించారు. మూడు రోజుల్లో మూడు దారుణాలు జరిగాయంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్న రమ్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య, నిన్న బాలికపై మానవ మృగం దాడి, నేడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా జగన్ రెడ్డిలో చలనం లేదని నారాలోకేష్ వ్యాఖ్యానించారు. బాధితులను పరామర్శించేందుకు మనస్సు రావడంలేదని అన్నారు. ఇంకా 16 రోజులే మిగిలాయని… రమ్యని అంతం చేసిన మృగాడికి శిక్ష ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు.