తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందింది. తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కోర్టుల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. దీని ద్వారా ఈ నెల 11 నుంచి 31 వరకు 1,904 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఎగ్జామినరీ 66, ఫీల్డ్ అసిస్టెంట్ 77, జూనియర్ అసిస్టెంట్ 275, రికార్డ్ అసిస్టెంట్ 97, ప్రాసెస్ సర్వర్ 163, ఆఫీస్ సబార్డినేట్ 1,226 పోస్టులు ఉన్నాయి. మార్చిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అర్హులు tshc.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు. కాగా, అటు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్‌, గ్రూప్స్‌, ఇతర ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news