చిరంజీవి సినిమాకు రవితేజ కోట్ చేసిన పారితోషకం ఎంతంటే..?

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మాస్ మహారాజా కూడా చిరంజీవికి సవతి సోదరుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ధమాకా సినిమా విజయంతో ఫుల్ జోష్ లోకి వచ్చిన రవితేజ పూర్వ వైభవాన్ని పొందుతున్నాడు. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా చిత్రం డిసెంబర్ 23న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మొదట్లో కొంచెం ఓల్డ్ స్టోరీ అనే టాక్ వచ్చింది కానీ మాస్ మహారాజా కామెడీ ఎలిమెంట్స్, పాటలు, ఫైట్స్ అన్నీ కూడా ప్రేక్షకులు అలరించడం తో సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా రూ.100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇదిలా ఉండగా ఈయన ఈ సినిమాతో మళ్లీ పారితోషకం పెంచేసాడని వార్త వినిపిస్తోంది. క్రాక్ సినిమా తర్వాత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ఇప్పుడు ధమాకా చిత్రంతో మరింత పెంచేసారని తెలుస్తోంది.

ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రానికి సంబంధించి పారితోషకం కూడా లీక్ అయింది. ఈ సినిమాలో తన పాత్రకు రవితేజ భారీగానే డిమాండ్ చేశారట సుమారుగా రూ.18 కోట్లు కోట్ చేశారని సమాచారం. అయితే నిర్మాతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా కోటి రూపాయలు తగ్గించారని ఇప్పుడు రూ. 17 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 17 కోట్ల రూపాయలు అందుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news