వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా…!

-

లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోవడమే కాకుండా రైతులు సహా అనేక రంగాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చినా సరే వాళ్లకు మాత్రం ఇప్పుడు ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. లాక్ డౌన్ తో మత్య్సకారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం వారి కోసం మినహాయింపులు ఇచ్చింది.

తెలంగాణాలో కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ ని మే 7 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి మాత్రం అనుమతి ఇచ్చింది. తాజాగా మత్స్యకారులకు గుడ్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. తెలంగాణా వ్యాప్తంగా దాదాపు 3 నుంచి నాలుగు లక్షల మంది ఉన్నారు. వారు ఉపాధి కోల్పోయి బాగా ఇబ్బంది పడుతున్నారు.

అంతే కాదు చేపల కొరత కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలో వారికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. కరోనా సోకకుండా ఉండేందుకు మత్స్యకారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని ప్రభుత్వం, రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రంలో ఉండగా… లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాలకు కూడా చేపలు ఎగుమతి అవ్వడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news