వైశాఖం అంటే మాధవమాసం. ఈ మాసంలో వేసవి ప్రారంభం. వాతావరణ మార్పులు, అనేకరకాల ఫలాలు వచ్చే రోజులు. అనేక పరిణామాలకు ఈ మాసం ఆరంభం. అయితే ఈ మాసంలో మానవులు కొన్నికార్యాలను చేస్తే మంచిది అని పూర్వీకులు పేర్కొన్నారు. వాటిలో ప్రధానంగా రకరకాల వస్తువులను, పండ్లను ఈ మాసంలో తప్పక పేదలకు, పక్కవారికి, దేవాలయాలలో, పండితులకు, బ్రాహ్మణులకు దానం చేయాలని పేర్కొంది. ఆయా వస్తువులు, పండ్లు దానం చేస్తే ఏం ఫలమో తెలుసుకుందాం….
మామిడిపళ్ళు – పితృదేవతలు సంతోషిస్తారు, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
- పానకం కుండ – పితృదేవతలకు వంద సార్లు గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది.
- దోస, బెల్లం, చెరుకు – సర్వపాపాలు నశిస్తాయి.
- మంచం – సుఖసంతోషాలు అభివృద్ధి చెందుతాయి.
- వస్త్రాలు -ఆయుష్షు వృద్ధి,
- తెల్లవస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు పొంది అంత్యంలో ముక్తిని పొందుతారు.
- ఆవునెయ్యి – అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం పొందుతారు.
- అన్నదానం – విశేష ఫలితం పొందుతారు, సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు, సర్వధర్మాలను ఆచరించిన ఫలితం పొందుతారు.
- పెరుగు అన్నం – చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది.
- కుంకుమ – స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
- గంధం – తరచుగా ప్రమాదాలకు గురికాకుండా తప్పించుకోగలరు
- గొడుగు – సమస్త దోషాలు నివారింపబడతాయి, కష్టాల నుండి విముక్తి పొందుతారు, మృత్యుబాధ ఉండదు.
- ఫలాలు – జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
- బియ్యం – అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ప్రాప్తిస్తుంది.
తాంబూలం- అధిపతులు అవుతారు. - కొబ్బరికాయ – ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేస్తారు.
- మజ్జిగ – సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి కలుగుతుంది.
- చెప్పులు – నరకబాధల నుండి విముక్తి లభిస్తుంది.
- అదండీ సంగతి. మానవసేవయే మాధవసేవ. అపాత్ర దానం కాకుండా నిజమైనవారికి దానం చేయడం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు మనం శక్తిమేర సమర్పించుకోవడమే. అవసరమైనవారికి, యోగ్యత కలవారికి దానం చేసి తరించండి.
– శ్రీ