గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నల్లా బిల్లులు చెల్లించని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జంట నగరాల్లో పెండింగ్ నల్లా బిల్లులు వసూలు చేసేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్(OTS) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అసలు కట్టి లేట్ ఫీజు, దాని మీద ఇంట్రెస్ట్‌పై రాయితీ కల్పిస్తొంది. ఈ నెల 31లోగా పెండింగ్ నల్లా బిల్లులను మెట్రో వాటర్ బోర్డుకు చెల్లించి, ఆలస్య రుసుం, వడ్డీపై రాయితీ పొందాలని హైదరాబాద్ వాసులకు సూచించింది.
డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, బల్క్ ఎంఎస్‌బీ కేటగిరి కనెక్షన్లకు, ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కూడా ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం వర్తిస్తుందని మెట్రోపాలిటీ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో అధికారికంగా తెలిపారు. జంట నగరాల్లో భారీగా పేరుకుపోయిన నల్లా బిల్లుల వసూళ్ళపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.