తెనాలిలో ఇటీవలే సుహానా అనే యువతి కోమాలోకి పోయిన విషయం విధితమే. నవీన్ అనే వ్యక్తి సుహానాను దారుణంగా కొట్టడం వల్లనే ఆమె కోమాలోకి వెళ్లి రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం. దీంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గుంటూరు జీజీహెచ్ కి వెళ్లి మార్చురీలో ఉన్న సహానా మృతదేహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సుహానా అనే యువతి శరీరం పై గాయాలున్నాయని.. నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఎక్కడ చూసినా దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మరోవైపు నిందితుడు నవీన్ టీడీపీ కి చెందిన వాడు కావడంతోనే నిందితుడుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఘటనలో కూడా ప్రభుత్వం తరపున మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ బాధితుడికి రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వాలని కోరారు జగన్.