ఎంసెట్ రాసిన వారికి గుడ్ న్యూస్…!

-

కరోనా సమయంలో విజయవంతంగా కొన్ని పరీక్షలను నిర్వహించినా సరే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్ధులు. దీనితో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధుల కోసం విద్యా శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఏపీ ఎంసెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడనికి చివరి తేదీ గడువును ఉన్నత విద్యా మండలి పెంచింది.

అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని ఉన్నత విద్యా మండలి ప్రకటన చేసింది. ఈ నెల 12వ తేదీన సీట్ అలోట్మెంట్ వుంటుంది అని తెలిపింది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 17న వారి కాలేజీలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news