మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే ఇదే గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అర్హులు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్ట్స్ వున్నాయి. మొత్తం ఖాళీలు 1520 వున్నాయి. ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత పొందితే దరఖాస్తు చేయవచ్చు.
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయాలి. వయసు 18-44 ఏళ్లు ఉండాలి. రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక చేస్తారు. ఓంఎఆర్ లేదా ఆన్ లైన్ లో ఉంటుంది. ఎంపిక మొత్తం 100 మార్కులకు. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ. గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ. ఆగస్టు 25, 2023 నుండి దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 19, 2023.
పోస్టుల వివరాలు:
జోన్ 1 కాళేశ్వరం: 169
జోన్ 2 బాసర: 225
జోన్ 3 రాజన్న: 263
జోన్ 4 భద్రాద్రి: 237
జోన్ 5 యాదాద్రి: 241
జోన్ 6 చార్మినార్: 189
జోన్ 7 జోగులాంబ: 196