ఏపీలో కొత్త మద్యం షాపులు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల అందుకు సంబంధించి కొత్త టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యింది.అందుకోసం రాష్ట్రంలో నూతన లిక్కర్ పాలసీని చంద్రబాబు సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త మద్యం అందుబాటులోకి రావడంతో మందుబాబులు ఫుల్లు ఖుషీ అవుతున్నారు. ధరలు కూడా తగ్గించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కొత్త షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజాగా మందు ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తిని పెంచినట్లు తెలిపింది. ఈనెలాఖరు నాటికి రూ.2.4 లక్షల మద్యం కేసులు అందుబాటులోకి రానున్నాయి. పలుచోట్ల రూ.99 మద్యం లభించక మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించింది. కాగా, కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్లను రూ.99పై అమ్ముకునేందుకు అనుమతిని పొందాయి.