తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోందని పేర్కొన్నారు కేటీఆర్. పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతి పాలనే శాపం గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులపై తప్పులు చేసి.. తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం.. ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం..మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యం అంటూ ఫైర్ అయ్యారు.
మీ అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి.. పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికీ మీదే..పది నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది మీరే.. అంటూ ఆగ్రహించారు. మీ కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలు… మీ నిష్క్రియాపరత్వంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగాలు… మీ అవినీతి, అక్రమార్జనకు పెట్టుబడిదారులు బెంబేలు అంటూ మండిపడ్డారు. అందిన కాడికి దోచుకో.. బావమరిది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. అనే మీ దోపిడీ విధానాలతోనే ఆర్థిక వృద్ధికి బీటలు అంటూ పేర్కొన్నారు.