GOOD NEWS: దీపావళికి మీ ఇంటికి “జైలర్” వస్తున్నాడు!

-

తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్ తో చేసిన మరో మాయ జైలర్ మూవీ. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ మూవీ అందుకు రెండింతలు గా సక్సెస్ ను అందుకుని రజినీకాంత్ కు సాలిడ్ హిట్ ను అందించింది. ఈ సినిమా రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సాధించింది. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లోనూ విడుదలయ్యి రికార్డు స్థాయిలో వ్యూస్ ను సంపాదించింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ మూవీ బుల్లితెరపై టెలికాస్ట్ ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారట. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా జెమినీ ఛానెల్ లోనే ఈ సినిమా టెలికాస్ట్ అవ్వనుంది. త్వరలోనే దీనిపై అధికారిక వార్తను వెలువడించనున్నారు.

ఇక ఇందులో రజినీకాంత్ తో పాటుగా శివరాజ్ కుమార్, మోహన్ లాల్, తమన్నా లు నటించి క్రేజ్ ను మారిందగా పెంచేశారు. ఇక సినిమా మొత్తం నేపధ్య సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చిన అనిరుద్ రవిచందర్ ను అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news