VIRAL: ఇరాక్ ను వణికించిన కాంగో వైరస్…ఫ్రాన్స్ లో ఒక కేసు నమోదు !

-

గత రెండు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గురించి ఇప్పుడు తలుచుకున్న వణుకు పుడుతుంది. అంతలా మానవాళిని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలా చేసింది. ఇలాంటి రకరకాల వైరస్ లు వివిధ కారణాల వలన వ్యాప్తి చెందుతూ మనుషుల ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫ్రాన్స్ లో కాంగో వైరస్ మొదటి కేసు నమోదు అయిందట. ఈ కాంగో వైరస్ ఇటీవల ఇరాక్ మరియు స్పెయిన్ లలో మొదలైన సంగతి తెల్సిందే. దీని వలన ఇరాక్ లో మొత్తం 19 మంది ప్రాణాలు వదిలారు. స్పెయిన్ లోనూ 19 కేసులు నమోదు అయినా ఒక మరణం కూడా సంభవించలేదు. ఈ వైరస్ ముఖ్యంగా జ్ఞాతువుల్లోని రక్తం పీల్చే పేలు ద్వారా వ్యాపిస్తునట్లు కనుగొన్నారు. ఈ వైరస్ ఎబోలా జాతికి చెందిన వైరస్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ వైరస్ సోకినా వారు శ్వాస సరిగా ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, తీవ్ర జ్వరం లాంటివి లక్షణాలు గా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news