హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్ : చలాన్లపై ఇక రాయితీలు !

-

హైదరాబాద్ లోని వాహనదారులకు శుభవార్త. హైదరాబాద్ లో బైక్ అలాగే కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఎంతమంది తిరుగుతున్నారు. అయితే అలాంటి వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుభవార్త ఎందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో చాలా రోజులు ఎంతో మంది వాహనాలపై చలాన్ల ను చెల్లించకుండా ఉండటంతో భారీగా చలాన్లు అలాగే ఉండిపోయాయి.

దీంతో పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే చలాన్ లపై ఎంత రాయితీ ఇవ్వాలన్న దానిపై పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

దీనిపై చర్చించేందుకు హైదరాబాద్ సీపీ సి వి ఆనంద్ ఆధ్వర్యం లో ఉన్నతా ధికారులు భేటీ అయ్యారు. గత కొన్ని ఏళ్లుగా చలాన్లు పెండింగ్లో ఉండటం అలాగే వాహన దారులు చెల్లించలేక చేతులెత్తేయడంతో ట్రాఫిక్ పోలీస్ లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ చలాన్ లపై ఎంతవరకు రాయితీ ఇస్తారన్న విషయం త్వరలోనే పోలీస్ శాఖ ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news