రూ.2 వేల కోట్ల బాండ్లను వేలం వేసిన జగన్ సర్కార్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల కోట్లకు సెక్యురిటీ బాండ్లను వేలం వేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. రిజర్వు బ్యాంకు ద్వారా రూ. వెయ్యి కోట్లు చొప్పున వేర్వేరు గా సెక్యూరిటీలను వేలం వేసిన ఏపీ సర్కార్‌… 20 ఏళ్ల కాల పరిమితి తో రూ. 1000 కోట్లు, 15 ఏళ్ల కాల పరిమితితో మరో రూ. 1000 కోట్ల విలువైన సెక్యూరిటీల వేలం వేసింది.

ఇక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక వార్షిక వడ్డీ రేట్లకు ఏపీ సెక్యురిటీల ను వేలం వేయడం గమనార్హం. ఈ నేపథ్యం లోనే 20 ఏళ్ల కాలానికి 7.14 శాతం వడ్డీ తో సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. 15 ఏళ్ల కాలానికి 7.13 శాతం వడ్డీతో సెక్యురిటీ బాండ్ల విడుదల చేసింది రిజర్వు బ్యాంక్ ఇండియా. కాగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా అప్పుల్లో కూరు పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో రూ. 2 వేల కోట్ల కు సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం అందరినీ షాక్‌ కు గురి చేసింది.