దేశ వ్యాప్తంగా ఇప్పడు అందరి చూపు పశ్చిమ బెంగల్ పై ఉంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. బెంగాల్లో త్రుణమూల్ పార్టీకి మెజారీటీ రావడంతో సీఎంగా పదవి చేపట్టింది. అయతే అసెంబ్లీలో ఎటువంటి పదవి లేకపోవడంతో ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీనితో పాటు షంషేర్ గంజ్, జంగీపూర్ స్ఠానాలకు, మొత్తంగా 3 నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జ
రుగనున్నాయి. గతంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి త్రుణమూల్ తరుపున ఆపార్టీ తరుపున చటోపాద్యాయ గెలుపోందారు. అయితే దీదీ కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు తెరలేపారు. ప్రస్తుతం దేశం అంతా దీదీ పోటీ చేస్తున్న భవానీ పూర్ పై అందరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా మమతను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మమత గెలిస్తే ఓకే, ఒకవేళ ఓడిపోతే మాత్రం ఉపఎన్నికల్లో ఓడిపోయిన మూడో సీఎంగా మిగులుతారు.