నాణ్యమైన వైద్యసేవలని ప్రజలకి అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం దిశగా జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అలానే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై సమీక్ష జరిపారు. అంటు రోగాలు, ఇతరత్రా వైద్య పరిశోధనలు, సర్వేలలో భాగస్వామ్యం మీద కూడా చర్చ జరిపింది.
భవిష్యత్తులో యువతకు వైద్యానికి సంబంధించిన కోర్సులు, శిక్షణ, డిగ్రీ పట్టా అందించడం పైనా ఈ కాన్ఫరెన్స్ లో చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ఏపీ ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. సుమారు రూ. 2 లక్షల కోట్లు వెచ్చించి రానున్న 3 ఏళ్లలో ప్రాథమిక వైద్య కేంద్రాలు సహా ఏపీ లోని ఆస్పత్రుల ఆధునీకరణ చేస్తామని అయన అన్నారు. నిరుపేదల కోసమని 10 వేల గ్రామాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు కొత్త ఊపిరి పోస్తున్నాం అని అయన చెప్పుకొచ్చారు,