గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వం గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేసేది. కానీ మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం నిబంధనలను మార్చింది.
గొర్రెల పంపిణీ పథకంకు సంబంధించిన డబ్బులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించింది. తోలుత నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా నగదును జమచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలో 4,699 లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వ వాటా కింద ఒక్కొక్కరికి రూ. 1.58 లక్షల చొప్పున జమ చేయనుంది. రానున్న 15 రోజు ల్లో వీటిని జమ చేయాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.