క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్…!

-

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డును ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ ని కనుక చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని చెప్పింది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. రూపే క్రెడిట్ కార్డును ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ ని చేస్తే చార్జెస్ పడవట. కానీ రూ. 2000 వరకు ట్రాన్సాక్షన్స్ చేసేవారికి మాత్రమే ఈ బెనిఫిట్.

అయితే ఇలా చేయడం వలన క్రెడిట్ కార్డ్స్ ని ఎక్కువ మంది ఉపయోగిస్తారని చెప్పింది. అలానే ఈ నిర్ణయం వలన కస్టమర్లు, వ్యాపారులు కూడా బెనిఫిట్ ని పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని క్లియర్ గా చేసింది. యుపిఐ ట్రాన్సక్షన్స్ కోసం డెబిట్ కార్డులు లేదా బ్యాంకు అకౌంట్లను లింక్ చెయ్యాలని అంది.

ఇది వరకు ఈ పద్దతి లేదు. కానీ ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా అవకాశం కలిపించింది. దీని మూలంగా క్రెడిట్ కార్డుల వినియోగం ఐదింతలు పెరుగుతుందని అంటున్నారు. రూపే కార్డులు నాలుగు సంవత్సరాల నుండి వున్నాయి. చాలా మంది ఉపయోగిస్తున్నారు కూడా. అన్ని బ్యాంకులు కూడా అప్పటి నుంచే ఈ కార్డులను తమ కస్టమర్లకు ఇస్తున్నారు.

రూపే క్రెడిట్ కార్డులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పైగా ఉపయోగించడమూ సులభమే. ఇదిలా ఉంటే ఇప్పుడు యూపీఐ లావాదేవీలకు క్రెడిట్ కార్డును వాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. పైగా రూ. 2000 లోపు మొత్తానికి చార్జెస్ ని తొలగించడం ప్లస్ అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news