ఆ రైతులకి గుడ్ న్యూస్… అకౌంట్ లోకి రూ.4,000…!

-

అన్నదాతలకు గుడ్ న్యూస్. ఒకేసారి బ్యాంక్ అకౌంట్‌లోకి నాలుగు వేలు పడచ్చు. ఇక మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకి ఏటా రూ. 6 వేలు లభిస్తాయి. ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా వస్తాయి. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఏడాదికి మూడు విడతల రూపం లో రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పడతాయి. మొత్తంగా రైతుల కి రూ. 6 వేలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం 13 విడతల డబ్బులను రైతులకు ఇప్పటి వరకు ఇచ్చింది.

farmers

ఇక 14వ విడత డబ్బులు రావాలి. కొంత మంది రైతులు మాత్రం రూ. 4 వేలు పొందే అవకాశం వుంది. చాలా మంది రైతులకు మాత్రం 14వ విడత కింద రూ. 2 వేలు వస్తాయి. కానీ కొందరికి మాత్రం రూ. 4 వేలు వస్తాయి. ఇక మరి వాటి కోసం చూసేద్దాం. ఏ రైతులు అయితే 13 వ విడత కింద రూ. 2 వేలు పొందలేదు వాళ్లకి రూ. 4 వేలు లభించచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోని రైతులకు 13వ విడత డబ్బులు నిలిచిపోవచ్చు. అందుకు రూ.2 వేలు వచ్చి ఉండవు.

వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వాళ్లకి ఆ డబ్బులు ఇప్పుడు రావచ్చు. అందువల్ల ఇలాంటి వారికి 14వ విడత కింద రూ. 4 వేలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ డబ్బులు వస్తాయా రావా అనేది పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది. దానిలో చూసి తెలుసుకోవచ్చు. ఏప్రిల్ – జులై మధ్య కాలం లో రైతుల బ్యాంక్ ఖాతాలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత డబ్బులు వస్తాయి. గత ఏడాది 11వ విడత డబ్బులు మే 31న బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చాయి. ఈసారి మే 15 నాటికి పీఎం కిసాన్ డబ్బులు పడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news