జగన్ సర్కార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

-

సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాలు సార్లు ఫిర్యాదు చేశామని.. అయినా ఆయా ఫిర్యాదులపై తగు రీతిలో స్పందించి చర్యలు తీసుకోలేదని లేఖలో చంద్రబాబు తెలిపారు.

ఇప్పుడు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని.. అధికార వైసీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. అనుమతించిన దానికి మించి జయప్రకాష్ వెంచర్స్ ఇసుక తవ్వకాలకు చేస్తోందని.. ఇక్కడ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగిందని వెల్లడించారు.

ఎన్‌జిటి, ఇతర కోర్టుల నుండి అనేక ఆదేశాలు ఉన్నా.. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టలేదు… నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారన్నారు. అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలం అవుతున్నారు… ఇష్టారీతిన ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరగుతుందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టాలని..సహజ వనరులను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని లేఖలో చంద్రబాబు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news