స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ లిమిట్ పెంపు..!

-

దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్స్ కి శుభవార్త. తాజాగా స్టేట్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని వలన కస్టమర్స్ కి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

స్టేట్ బ్యాంక్ మహమ్మారి కారణంగా తాత్కాలికంగా క్యాష్ విత్‌డ్రాయెల్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనితో ఎస్బీఐ కస్టమర్స్ కి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. పైగా బ్యాంక్ కస్టమర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి హోమ్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు.

సమీపం లో వున్న ఏ ఎస్‌బీఐ బ్రాంచు లో అయినా ఇప్పుడు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు అని ఎస్బీఐ వెల్లడించింది. సేవింగ్స్ బ్యాంక్ పాస్ బుక్, విత్‌డ్రాయెల్ ఫామ్ ద్వారా అయితే రోజుకు రూ.25 వేల వరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

చెక్ బుక్ ద్వారా రోజుకు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతే కాకుండా థర్డ్ పార్టీ క్యాష్ విత్‌డ్రాయెల్‌కు కూడా బ్యాంక్ అనుమతి ఇచ్చింది. నెలకు చెక్ ద్వారా రూ.50 వేలు తీసుకోవచ్చు అని అంది. ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news