స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో వుండే ఇలా సింపుల్ గా.. రూ.40 లక్షల కవరేజీ పొందండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ రూ. 40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవర్‌ను కూడా అందిస్తోంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పేరుతో ఇన్సూరెన్స్‌ పాలసీ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది.

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లైఫ్ కవరేజీని పొందడానికి అవుతుంది. ఒక గ్రూప్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం జీవిత బీమా పాలసీ ఇది. మీ గ్రూప్ మెంబర్‌ల డిపెండెంట్‌లకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సహాయం ని అందిస్తుంది. ఆర్థిక సహాయం, గ్రూప్ అవసరాలకు అనుగుణంగా ఉపయోగాలని అందిస్తోంది. సులభమైన ఆన్-బోర్డింగ్ ప్రక్రియ ద్వారా సింప్లిసిటీ ద్వారా భద్రతను కూడా ఈ పాలసీ తో పొందవచ్చు.

అలానే దీన్ని తీసుకుంటే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మినహాయింపులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు ఎలా యెనో తో ఈ పాలసీని కొనచ్చో చూద్దాం. ముందు ఎస్‌బీఐ కస్టమర్‌లు యోనో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లాలి. ఇక్కడ “పాలసీని కొనండి” విభాగాన్ని సెలెక్ట్ చేసేసి సింపుల్‌గా పాలసీను కొనుగోలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news