రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు..? రాహుల్ గాంధీకి పెళ్లి సలహా ఎందుకు ఇచ్చారు..? అన్న ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. ఎవరైతే ప్రధాని అవుతారో వాళ్లకు పెళ్లి తప్పనిసరిగా కావాలని అన్నారు. ప్రధానమంత్రి నివాసంలో భార్య లేకుండా ఉండడం తప్పు అని పేర్కొన్నారు లాలు. ఇక తనపై ఓ కేసు తర్వాత మరో కేసు, లేదంటే తన కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలలో ఐక్యత తేవడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నాలను లాలు ప్రశంసించారు. 2024 ఎన్నికలలో ప్రతిపక్షాల కూటమి 300కు పైగా స్థానాలలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసత్వంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా మనమంతా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.