రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

-

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు బుధవారం తెలిపింది. డీఏ 38 శాతంగా ఉండగా తాజా నిర్ణయంతో అది 42 శాతానికి చేరింది.

డీఏ పెంపు పాలసీని జనవరి 1, 2023 నుంచే అమలు చేస్తున్నట్టు తెలిపింది. సీఎం యోగి ఆదిత్య నాథ్ నేతృత్వం లోని రాష్ట్ర సర్కార్. యోగి సర్కార్ నిర్ణయంతో రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు కి మేలు కలిగింది. 27.35 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. త్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న 16.35 లక్షల మంది ఉద్యోగులు, 11 లక్షల మంది పెన్షనర్లు కి లాభం కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

పెంచిన డీఏ ని జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కి జమ చేస్తారు. మిగిలినవి మే నెల అమౌంట్ జూన్ శాలరీతో పాటు ఇస్తారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం తో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా ఏడాదికి రూ.2,366.82 కోట్ల భారం పడింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఇలాంటి ప్రకటనే చేసింది తమిళనాడు ప్రభుత్వం. కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభం ఏప్రిల్ నుంచే అమలులోకి తీసుకొస్తామని తెలిపింది. రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు కూడా అంతకు ముందు ఉద్యోగులకు 4 శాతం డీఏం పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Latest news