టాలీవుడ్ యంగ్ హీరోతో సమంత రొమాన్స్ !

-

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావోస్తున్నప్పటికీ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. సమంత చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంపై ఇప్పటికి అభిమానులకు అర్థం కావడం లేదు.

కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత… సమంత క్రేజ్‌ మాత్రం భారీగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉండగా, సమంత.. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డతో సినిమా చేయనుందట. లవ్‌ ట్రాక్‌ నడిచే ఈ సినిమాను నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు సమంత కూడా దీనికి ఒప్పుకుందట. ఇక త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news