గుడ్‌న్యూస్‌: అకౌంట్ తెరిస్తే వోచర్లు.. రుణాలపై బంపరాఫర్లు..!

కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకునేవారికి ఒక గుడ్ న్యూస్. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లో అకౌంట్ తెరిస్తే అనేక బంపరాఫర్లు లభించబోతున్నాయి. మీరు బ్యాంక్ లో అకౌంట్ తెరిస్తే మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వోచర్లు కూడా పొందవచ్చు. ఇంకా రుణాలపై ఆకర్షణీయ డీల్స్ లభిస్తున్నాయి. అన్ని బ్యాంకులు ఒకదాని తర్వాత మరొకటి వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందుకు గల ముఖ్య కారణం పండుగ సీజన్ కావడం. ఇదే బాటలో ఇప్పుడు మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్‌‌ను తక్కువ వడ్డీకే అందిస్తోంది. కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది సువర్ణావకాశం అని చెప్పొచ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇదేకాకుండా కస్టమర్లకు మరో ఆఫర్ కూడా తీసుకువచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే వారికి వోచర్లు అందిస్తోంది. అంటే బ్యాంక్ ఖాతా తెరిస్తే చాలు మీరు అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వోచర్లు పొందవచ్చు. వీటి విలువ రూ.250. ఈ స్కీమ్ ఒక్క నెల రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఇతర బ్యాంకులతో పోటీ పడేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు అందిస్తోంది. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్స్‌ పై వడ్డీ రేట్లను 7 శాతం తగ్గించింది. ఇదేకాకుండా అగ్రి లోన్, రిటైల్ లోన్స్‌ను ఆన్ ‌లైన్ ‌లోనే పొందే సౌలభ్యం కల్పిస్తుంది. ఇంకా లోన్ ‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తూ చాలా సదుపాయాలు కల్పిస్తోంది.

ఇకపోతే పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకులు అన్ని ఒకదాని తర్వాత మరొకటి పోటీ పడుతూ ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి బ్యాంక్స్ ఇప్పటికే ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తున్నాయి. వీటితోపాటు యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటివి కూడా కస్టమర్లకు అనేక ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తున్నాయి.