నాగ్ మిస్సైల్ ట్రైల్స్ సక్సెస్..

-

యుధ్ద ట్యాంకులను తునాతునకలు చేసే నాగ్ మిస్సైల్ అంతిమ ప్రయోగం విజయవంతం అయింది. ధర్డ్ జనరేషన్ యాంటీ టాంకు గైడెడ్ మిసైల్ (నాగ్) ను మిసైల్ కారియర్ నామిక నుంచి ప్రయో గించారు. అంతిమ ప్రయోగం విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఉత్పత్తిని ప్రారంభించ నుంది. నాగ్ మిసైల్స్ ను ప్రభుత్వ రంగ సంస్థ “భారత్ డైనమిక్స్ లిమిటెడ్” ( బి.డి.ఎల్) ఉత్పత్తి చేయనుంధి.

 

మిసైల్ కారియర్ “నామిక” లను “మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ” ఉత్పత్తి చేయనుంది. పగలైనా, రాత్రి అయినా, శత్రుసైన్యాలకు చెందిన యుధ్ద ట్యాంకులను ఛేదించి ధ్వంసం చేసే మిసైల్స్ ను స్వదేశీ పరిజ్ఞానంతో డి.ఆర్.డి.ఓ రూపొందించ నుంధి. డి.ఆర్.డి.ఓ ను, సైన్యాన్ని రక్షణ మంత్రి రాజనాధ్ అభినందిం చారు. నాగ్ మిసైల్ ను ఉత్పత్తి దశకు విజయవంతంగా తీసుకొచ్చినందుకు డి.ఆర్.జి.ఓ, భారత సైన్యం, పరిశ్రమను డి.ఆర్.డి.ఓ ఛైర్మన్ డాక్టర్.సతీశ్ రెడ్డి అభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news