రోజా-రజిని ప్రత్యర్ధులు రెడీ..మళ్ళీ చెక్ పెట్టేస్తారా?

-

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ ఉన్న వారిలో రోజా, రజిని ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అయితే రోజా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒక ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఎదగడం వల్ల ఆమె అందరికీ తెలుసు. ఇక ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి..తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన రజిని అతి త్వరగా మంత్రి పదవి దక్కించుకుని ఫేమస్ అయ్యారు.

ఇక ఈ ఇద్దరు ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మరి ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తారా? అంటే ఖచ్చితంగా గెలుస్తారని వారి అభిమానులు, వైసీపీ శ్రేణులు అంటున్నాయి. రోజా రాజకీయాల్లోకి వచ్చి మొదట టి‌డి‌పిలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. కానీ చాలా తక్కువ మెజారిటీలతోనే గెలిచారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.

ప్రస్తుతం నగరిలో ఆమెకు అనుకూల అంశాలు ఉన్నాయి..ఆమె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు..ప్రజలకు అండగానే ఉంటారు. అయితే అక్కడ టి‌డి‌పి నిదానంగా బలపడుతుంది. కానీ టి‌డి‌పి నేత గాలి భానుప్రకాశ్‌కు సొంత కుటుంబ పోరు ఉంది. అటు రోజాకు కూడా సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఇదే ఆమెకు మైనస్. అయినా సరే ప్రస్తుతానికి రోజాకే లీడ్ ఉంది.

అటు చిలకలూరిపేటలో రజిని దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ప్రత్యర్ధి, టి‌డి‌పి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు బలపడుతున్నారు..కానీ టి‌డి‌పిలో ఆయన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు. ఇటు రజినికి కూడా సొంత పార్టీలో వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. అయినా సరే రజినికి పేటపై పట్టు వచ్చింది. అక్కడ బీసీ, ఎస్సీ వర్గాలు రజినికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె లీడ్ లో ఉన్నారు. దీంతో ఈ సారి కూడా ఆమె గెలుపు అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news