ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్‌ బీమా… 50 వేలకు పైగా మందికి లబ్ది !

-

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు అందించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఉన్నటు వంటి ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా అందించాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ కార్పొరేట్‌ బీమా కారణంగా… ఒక వేళ ఆర్టీసీ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.40 లక్షల బీమా లభించనుంది.

అంతే కాదు… పిల్లల విద్య , వివాహ రుణాలు కూడా మాఫీ కానున్నాయి. అలాగే…. ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వతంగా వికలాంగులైతే రూ.30 లక్షలు అందించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు… సహజ మరణానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే ఎస్ బి ఐ బ్యాంకు తో ఆంధ్ర ప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్పొరేట్‌ బీమా కారణంగా ఏకంగా 50, 500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. కాగా… ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news