గూగుల్‌ నయా ఫీచర్‌తో.. ఫేక్‌ న్యూస్‌కు చెక్‌!

-

ఇటీవలి కాలంలో అందరిరూ న్యూస్‌ పోస్ట్‌ చేస్తున్నారు. అందులో ఈ విపత్కర కాలంలో దీని ప్రభావం ఎక్కువైంది. ఈ వార్త నిజమేనా? కాదా? అనే సందిగ్ధంలో పడిపోతున్నారు ప్రజలు. అయితే, ఈ ఫేక్‌ న్యూస్‌ విధానానికి చెక్‌ పెట్టేందుకే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్‌. కొందరు పనిగట్టుకొన్ని ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తుంటే, మరికొందరు తెలియక న్యూస్‌ షేర్‌ చేస్తున్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌ ముందుకు వచ్చాయి. ఇప్పటికే మానిపులేటెడ్‌ మీడియా లేబుల్‌తో ఫేస్‌బుక్‌ ఫేక్‌ సమాచారాన్ని ఫిల్టర్‌ చేసే పని చేస్తోంది. గూగుల్‌ కూడా ఇదే కోవాలో అతి ముఖ్యమైన ఫీచర్‌ను సెర్చ్‌ విభాగంలో తీసుకురానుంది. దీని ద్వారా ఆ ఫేక్‌ న్యూస్‌ను గూగుల్‌లో పేస్ట్‌ చేసి, సెర్చ్‌ చేయగానే ఫేక్‌ న్యూస్‌ను సులభంగా గుర్తించవచ్చు. దీని ద్వారా వినియోగదారులను హెచ్చరించే సదుపాయం తీసుకురానుంది. ఈ ఫీచర్‌ను ఇటీవలి గూగుల్‌ సమావేశంలో చర్చించింది. సెర్చ్‌లో ‘అబౌట్‌ దిస్‌ రిజల్ట్‌’ ఫీచర్‌ తీసుకొచ్చి.. ఆ సమాచారం ఎక్కడి నుంచి.. ఏ సోర్స్‌ నుంచి వచ్చిందో తెలియజేయనుంది.

వెబ్‌సైట్‌ వివరణ ఎలా ఉందని యూజర్లు చూడడంతో పాటు దాని వికిపీడియా పేజీల లింక్‌లు యూజర్లకు కనిపించనున్నాయి. దీనికి వికిపీడియాతోనూ గూగుల్‌ పని చేయనుంది. ఈ సమాచారం చాలా అప్‌డేటెడ్‌గా ఉంటుంది. ఒకవేళ వెబ్‌సైట్లకు వికీపీడియా పేజీలు లేకపోతే, ఆ సమాచారాన్ని గూగులే వినియోగదారులకు చూపించనుంది. హెచ్‌టీటీపీఎస్‌ ఆధారంగా వెబ్‌సైట్‌ సురక్షితమైందా? కాదా? అన్నది కూడా గూగుల్‌ చూపించనుంది. దీనిద్వారా బ్రౌజింగ్‌ డేటా సురక్షితంగా, గోప్యంగా ఉందా లేదా అన్నది కనిపెట్టవచ్చు. ఇంగ్లిష్‌లో యూజర్లందరికీ ఈ నెలాఖరులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news