కరోనా వైరస్ విడుదల కావడానికి ముందు వుహాన్ ల్యాబ్ లో ఏం జరిగింది…?

-

కరోనా వైరస్ కేసులు నమోదు కావడానికి ముందు 2019 లో చైనీస్ వైరాలజీ ప్రయోగశాలలో పరిశోధకులు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారనే నివేదికలను యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ వ్యాధిని కావాలని సృష్టించారు అనేది రుజువు కాలేదు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు.

యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 2019 నవంబర్‌లో ముగ్గురు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యుఐవి) పరిశోధకులు అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. ఆస్పత్రిలో వారు చికిత్స తీసుకున్నారని తెలిసింది. ఈ పరిశోధకులు ఆసుపత్రిలో చేరారా లేదా వారి లక్షణాలు ఏమిటో స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్ మొదట వుహాన్‌లో కనిపించింది. తరువాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news