పట్టువదలని విక్రమార్కుడు కోహేన్..సక్సెస్ స్టోరీ..

-

కొంతమందికి కొన్ని సాధించాలనే కోరిక ఉంటుంది.. దాని కోసం ఎంత వరకైనా వెలతారు..వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోనేవరకు వెనుకడుగు వెయ్యరు.అందుకే అలాంటి వారిని జగ మొండి అంటారు..వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొనేవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు..అలా మొత్తానికి సక్సెస్ ను అందుకుంటారు.. ఇప్పుడు టైలర్ కోహేన్ అనే వ్యక్తి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టేలర్ కోహెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Google అతన్ని 39 సార్లు తిరస్కరించింది. అయినప్పటికీ నిన్ను వదల బొమ్మాలీ అన్న డైలాగ్‌ను వంటపట్టుకున్నాడో ఏమో కానీ.. మళ్లీ మళ్లీ జాబ్ కోసం అప్లై చేస్తూనే వచ్చాడు. ఇన్నిసార్లు రిజెక్ట్ అయినా మళ్లీ మళ్లీ అప్లై చేస్తుండటంతో.. ఒకానొక సమయంలో తనను తాను పిచ్చివాడిగా భావించాడు కోహెన్. అయినప్పటికీ, అతను గూగుల్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం మానలేదు. అమెరికన్ ఫుడ్ డెలివరీ కంపెనీ డోర్‌డాష్‌లో అసోసియేట్ మేనేజర్-స్ట్రాటజీ, ఆపరేషన్స్‌గా పనిచేసిన కోహెన్, తన 40వ దరఖాస్తు తర్వాత గూగుల్‌లో జాబ్ సంపాదించాడు..

కొహెన్ మొదట 25 ఆగస్టు 2019న Googleకి అప్లై చేశాడు. కానీ గూగుల్ ఆ అప్లికేషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత 2019 సెప్టెంబర్‌లో రెండుసార్లు అప్లై చేసుకున్నాడు. ఈసారి కూడా తిరస్కరించారు. కొంతకాలం విరామం తీసుకుని జూన్ 2020లో మళ్లీ అప్లై చేసుకున్నాడు. ఇలా మొత్తం 39 సార్లు అప్లై చేయగా.. అన్నిసార్లు గూగుల్ అతని అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసింది. చివరగా, 19 జూలై 2022న, గూగుల్ అతనికి ఉద్యోగం ఇస్తూ మెయిల్ పంపింది. 40వ సారి దరఖాస్తు చేసుకున్న తరువాత అతనికి ఈ అవకాశం లభించింది..ఇప్పుడు అతను గూగుల్ లో జాబ్ చేస్తున్నాడు..ఏదైనా అనుకుంటే రాలేదు అని వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే తప్పక వస్తుందని నిరూపించాడు..అందరికి ఆదర్సంగా నిలిచాడు..

Read more RELATED
Recommended to you

Latest news