గూగుల్ పిక్సల్ నుండి బడ్స్..ధర ఎంతంటే.. ?

-

ప్రస్తుతం ఇయర్ ఫోన్ల లో ఎక్కువగా వైర్ లెస్ బడ్స్ ను వాడుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని రకాల కంపెనీలు బడ్స్ ను విడుదల చేస్తాయి. కాగా తాజాగా ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ గూగుల్ పిక్సెల్ కూడా భారత మార్కెట్లోకి పిక్సెల్ బడ్స్ ను విడుదల చేసింది. దాంతో దేశంలోని పర్సనల్ వైర్లెస్ ఆడియో విభాగంలోకి అడుగుపెట్టినట్టు గూగుల్ పిక్సెల్ ప్రకటించింది. వీటి ధర రూ. 9,999 కాగా 12mm డైనమిక్ స్పీకర్ డ్రైవర్లతో వీటిని రూపొందించారు.

ఈ బడ్స్ లో పరిసరాలకు అనుగుణంగా శబ్దం దానంతట అదే తగ్గడం మరియు పెరగడం జరుగుతుంది. సాధారణంగా అయితే ఇతర బడ్స్ లో మనమే శబ్దాన్ని తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చేస్తూ ఉంటాం. అయితే ఇందులో మాత్రం ఆటోమెటిక్ సిస్టం ఉండటం వల్ల బిజీగా ఉన్న సమయంలో సౌండ్ తగ్గించు కోవడం లేదా పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా ఒకసారి ఛార్జింగ్ పెడితే 5 రోజులపాటు ఛార్జింగ్ వస్తుంది. ఇక సరికొత్త ఫీచర్లతో వచ్చిన గూగుల్ బర్డ్స్… యాపిల్ బడ్స్ కు పోటీగా వచ్చే అవకాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news