గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు రాజా సింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు.ఈ మేరకు ఆఫ్జల్‌గంజ్ పోలీసులు ఆయన పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గౌలిగూడ వద్ద ర్యాలీ ఆపి బాణాసంచా కాల్చడంతో పాటు భక్తులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు ,ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు జోగేందర్ సింగ్, బిట్టులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలీ తీసిన చేశారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున రామ భక్తులు, బీజేపీ కార్యకర్తలు, రాజా సింగ్ అభిమానులు వచ్చారు. అయితే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి ఇవ్వనప్పటికీ రాజా సింగ్ ర్యాలీ తీయడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.