ప్రజాగోస యాత్రకు జనం రాలేదని అలిగి వెళ్లిన రాజాసింగ్

-

గోషామహల్ ఎమ్మెల్యే ప్రజాగోస-భాజపా భరోసా యాత్ర నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. స్థానిక నేతలు, కార్యకర్తలకు చెప్పాపెట్టకుండా వాకౌట్ చేశారు. అయితే ఆయన అలిగి వెళ్లారని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఇంతకీ రాజాసింగ్ సొంత పార్టీ నాయకులపైనే ఎందుకు అలిగారు..?
నిజామాబాద్​ జిల్లా బోధన్ పట్టణంలో “ప్రజాగోస.. భాజపా భరోసా” యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రంలో రాజాసింగ్ ​తో పాటు పలువురు భాజపా అగ్రనేతలు పాల్గొంన్నారు. ఈ క్రమంలోనే.. ఈరోజు యాత్ర జరుగుతుండగానే రాజాసింగ్​ కాన్వాయ్​ మధ్యలో నుంచి​ వెళ్లిపోయారు. ఏడు రోజులుగా యాత్ర కొనసాగుతున్నా.. జనం నుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. దీనిపై ఇప్పటికే రాజాసింగ్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం​. అయితే ఈరోజు కూడా.. యాత్రలో జనం అంతగా పాల్గొనకపోవటంతో కొంత అసహనానికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజాసింగ్​​ ఏకంగా కాన్వాయ్​ మధ్యలో నుంచి వాకౌట్​ చేశారు.
తాను వెళ్లిపోతున్నట్టు కనీసం.. జిల్లా, నియోజకవర్గ నాయకులకు కూడా సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం. రాజాసింగ్​ వాకౌట్​తో ఉలిక్కిపడ్డ భాజపా నాయకులు.. ఏం జరిగిందో..? ఏం చేయాలో.. తెలియక తలలుపట్టుకున్నారు. చేసేదేమీలేక ముఖ్య అతిథి లేకుండానే వచ్చిన ఆ కొంత మంది కార్యకర్తలతోనే సభను కొనసాగించారు. అయితే.. రాజాసింగ్​ అలక మాత్రం భాజపా జిల్లా, నియోజకవర్గ నాయకులపైనే అని అర్థమవుతోంది. యాత్రకు జనసమీకరణ చేయలేకపోయారనో.. లేక జనంలోకి పార్టీని సరిగ్గా తీసుకెళ్లలేకపోతున్నారనో.. కారణమేదైనా జిల్లా, నియోజకవర్గ నాయకుల పనితీరు నచ్చకపోవటమే రాజాసింగ్​ అలకకు కారణమని.. శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news