గంభీర్ కు మరోసారి బెదిరింపు ఈ మెయిల్…పోలీసులకు ఫిర్యాదు.

-

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు మళ్లీ బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. ఇప్పుటి వరకు మూడు సార్లు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల మూడు రోజుల క్రితం ఇలాగే గంభీర్ కు బెదిరింపు ఈమెయిళ్ల వచ్చాయి. ఐసిస్ ఉగ్రవాదుల పేరుతో ఈ మెయిల్ వచ్చినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో గంభీర్ కు వచ్చిన మెయిల్ లో ‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్‌. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్‌ అంశాన్ని వదిలెయ్‌’ అని మెయిల్‌లో బెదిరించారు. దీంతో ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

ప్రస్తుతం వచ్చిన ఈమెయిల్ పై ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఐసిస్ కాశ్మీర్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా గతంలో బెదిరింపు ఈమెయిళ్లు పాకిస్థాన్ కరాచీ సింధ్ యూనివర్సీటీ నుంచి షాహీద్ హమీద్ అనే యువకుడు పంపించారని నిర్థారించారు. తాజాగా మరో బెదిరింపు ఈ మెయిల్ రావడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news