కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు.. బిజేపి అధ్యక్షుడు మారబోతున్నాడు !

-

కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పడం జరిగిందని.. టిఆర్ యస్ అభ్యర్థులు గా బాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయా ? ఈటెల రాజేందరా ? అనేది అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయట్లేదని బండి సంజయ్ అంటే ఈటెల రాజేందర్ పోటీలో పెట్టామని అంటున్నారని.. బిజెపి లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈటెల రాజేందర్ పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళను కలుస్తున్నాడని.. దమ్ముంటే పార్టీ ద్వారా కొట్లాడాలని సవాల్ విసిరారు. ఎంపీ ఓ స్టేట్ మెంట్.. ఎమ్మెల్యే ఓ స్టేట్ మెంట్ బండి సంజయ్ కు చెక్కు పెట్టాలని ఈటెల చేస్తున్నడందంటూ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడని అనుకుంటున్నానని.. హుజురాబాద్ లో ఇలానే కుమ్మక్కు రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ని అమ్ముకున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను అమ్ముకుంటున్నారని.. బండి సంజయ్ కు తెలియకుండా బీజేపీ కార్పొరేటర్లు ఈటెల పెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఇలాంటి కుమ్మక్కులపై బిజెపి కాంగ్రెస్ లు ఎలా చేస్తాయో చూడాలని.. టి ఆర్ యస్ బలంగా ఉందని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి అధ్యక్షుడు కూడా మారే ఆవకాశం ఉందని తెలుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టి ఆర్ యస్ పతనం ప్రారంభం అయిందని రవిందర్ సింగ్ అన్నాడు.. కానీ పతనం అయింది రవిందర్ సింగ్ నే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news